V3 ఛానల్ అధినేత డా.కాచం సత్యనారాయణ కు రెడ్కెక్రాస్ వారి పదవి
April 24, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తెలంగాణ రాష్ట్ర అవోపా గౌరవ సలహాదారు కాచం ఫౌండేషన్ మరియు V3 ఛానల్ అధినేత శ్రీ కాచం సత్యనారాయణ గుప్త గారిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గ్రేటర్ హైదరాబాద్ విపత్తు నివారణ  విభాగం కన్వీనర్గా నియమిస్తూ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసి వారి కార్యాలయంలో నియామక ఉత్తర్వులను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ మాట్లాడుతూ  రెడ్ క్రాస్ సంస్థలో బాధ్యతాయుతమైన హోదా దక్కడం ఎంతో బలాన్నిచ్చిందని, లాక్డౌన్ నే పద్యంలో గడిచిన నెల రోజులుగా ప్రతిరోజు 1500 మంది పోలీస్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు నిర్వాసితులకు బిర్యానీ బాక్సులు పంపిణీ చేస్తున్నామని  రెడ్ క్రాస్  వారు తనకి ఈ పదవినిచ్చి బాధ్యతలు రెట్టింపు చేశారని,  ముందు ముందు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు.