Teachers Day Celebrations
September 8, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

ఆవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ & సైన్స్ మహిళా కళాశాల ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి  ముఖ్య అతిథిగా  శ్రీయుతులు కసిరెడ్డి వెంకటరెడ్డి, మారుతీ కిరణ్, శివకోటి నాగేశ్వరరావు, వై వి జి కె మూర్తి గౌరవ అతిథులుగా విచ్ఛేసి శ్రీయుతులు జి సురేంద్ర నాథ్, శంకరనారాయణ, రామానందం, "ట్యాగ్ లైన్ కింగ్" ఆలపాటి మరియు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత డా. డి రాజేశ్వరి,డా. పి రాజ్యలక్ష్మి, డా. ఎం శ్రీదేవి,డా. జి ఎల్ కె దుర్గ,డా. ఎస్ సునంద, ప్రొ.ఉష, శారద ప్రభ్రృతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో చాప్టర్ అధ్యక్షులు శ్రీ పి వి రమణయ్య గారితో పాటు కోశాధ్యక్షులు  శ్రీ కె వి ఎస్ గుప్త, శ్రీ రమణ రావు, శ్రీ ఎస్ వి ఎస్ మూర్తి , మోహానదాస్ తదితరులు పాల్గొన్నారు.