మేధస్సు - కవిత : మాడిశెట్టి గోపాల్
April 27, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

*మేధస్సు*

మానవ 
పరిణామ 
వికాసాలకు మూలం!!

ఆకాశంలో
పక్షిలా
ఎగరగలిగిన విజయం!!

సముద్రాన్ని 
చేపలా
ఈదిన అద్భుతం!!

శాస్త్ర సాంకేతిక
పురోగతికి
పునాది!!

విభిన్న 
ఆలోచనల 
స్థాయికి కారకం!!

ఫ్లెమింగ్ చేతిలో
పురుడు పోసుకున్న
పెన్సిలిన్!!

చంద్రమండలంపై
పాదం మోపిన
విజ్ఞానం!!

చరిత్ర గతిని 
మార్చిన
చరవాణి!!

రామానుజన్ 
గణిత శాస్త్ర 
నైపుణ్యం!!

శకుంతలా దేవి
కంప్యూటర్ పై
సాధించిన విజయం!!

క్లిష్ట పనులను
అవలీలగా 
చేయగలిగే రోబో!!

సృష్టికి ప్రతిసృష్టి
చేయగలిగిన
సామర్థ్యం!!

అపజయాలనుండి
ఆవిష్కృతమైన
ఎడిసన్ బల్బు!!

ప్రపంచాన్ని 
కుగ్రామంగా మార్చిన
ఇంటర్ నెట్!!

మహమ్మారులను
తరిమి కొట్టిన 
మహా సంకల్పం!!

అనంతమైన
ఊహాశక్తికి
కొలమానం!!

పుట్టుక నుండి
గిట్టుట వరకు
సాగే ఆలోచనలకు బీజం!!

మహత్తర కార్యాలన్నీ
మానవ మేధ తోనే
సాకారం
ఊహించగల శక్తి
మనకు లభించిన వరం

( ప్రపంచ *మేధో సంపత్తి* దినోత్సవం సందర్భంగా)

*మాడిశెట్టి గోపాల్*, కరీంనగర్