మంత్రి శ్రీ కే.టీ.ఆర్ పుట్టిన రోజున వారికి అరుదైన కానుక ఇచ్చిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
July 25, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

మున్సిపల్ శాఖామంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. టీ. ఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర Avopa గౌరవ సలహాదారు టి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐ. వీ. ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఓ అపురూపమైన కానుకను అందించారు. కేటీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, పొలిటికల్ కెరియర్, విజయాలు, ప్రపంచవ్యాప్తంగా చేసిన పర్యటనలు, ప్రజలకోసం చేసిన పోరాటాలు, హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడంలో కేటీఆర్ చేసిన కృషిని వివరిస్తున్న దృశ్య మాలికలతో ఉప్పల శ్రీనివాస్ ఒక పెయింటింగ్ ను వేయించారు. సామాజిక అంశాలపై పెయింటింగ్స్ వేసే కందుకూరి వెంకటేశ్ తో అద్భుతమైన దృశ్య రూపం గీయించారు. ఈ భారీ చిత్రంలో కేసీఆర్ లాంతర్ తో ధైర్యంగా నడుస్తుంటే వెనకాలే కేటీఆర్ నవ్వుతూ నడుస్తున్నట్టు, అంధకారం నుండి వెలుగులను కేటీఆర్ చూస్తున్నట్టు, మెట్రో పరుగులు, ఐటీ హంగుల మేళవింపు, ఇన్స్పిరేషన్, విజన్, అకౌంటబులిటీ అనే పదాలతో చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని ఉప్పల శ్రీనివాస్ గుప్త తన కుమారులు, సాయికిరణ్, సాయితేజ, చిత్రకారుడు వెంకటేశ్ తో కలిసి ప్రగతి భవన్ లో కే. టి. ఆర్ గారికి అందించారు. తన పట్ల చూపిస్తున్న అభిమానానికి కేటీఆర్ ఉప్పల శ్రీనివాస్ ను అభినందించారు.