నేటి దినసరి రాశి ఫలితాలు
November 13, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_13, నవంబర్ , 2020_* *_భృగు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది. చేసే పనిలో తడబాటు రానీయకండి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. కలహసూచన ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు. *_దుర్గా అష్టోత్తర శతనామావళి చదివితే మంచిది._* 

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మీ పనితీరు, ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. *_శని శ్లోకం చదవండిశుభ ఫలితాలు ఉంటాయి._*  

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలుపుకొని పోవడం వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం మంచిది. అనవసరమైన ఆందోళన తగ్గించుకుంటే మంచిది. *_దుర్గాస్తోత్రం చదవాలి_*  

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

కీలక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. *_సూర్యాష్టకం చదివితే బాగుంటుంది._*  

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

ప్రారంభించిన పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుంచి ప్రశంసలను పొందుతారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. *_విష్ణు సహస్ర నామ స్మరణ ఉత్తమ ఫలాలను ఇస్తుంది._*   

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు ఊహించిన దాని కన్నా అధిక ధనలాభాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులలో ముందడుగు పడుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. *_శివారాధన మేలు చేస్తుంది._* 

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. *_సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది._*  

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. *_శత్రువులపై విజయం సాధిస్తారు._* 

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అపమృత్యు భయం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. *_శని శ్లోకం చదవాలి._*        

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ మీ రంగాల్లో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. *_శివ నామస్మరణ చేస్తే మేలుశుభకాలం._*  

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. *_ఇష్టదైవ స్తోత్రాన్ని చదవడం మంచిది._*    

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. *_ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌

 

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈