తెలంగాణ రాష్ట్ర అవోపా వారి విజ్ఞప్తి
April 1, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

ప్రకృతి వైపరీత్యములు సంభవించినపుడు ఆర్తులను ఆదుకొనుట, ఆకలితో బాధపడుతున్న పేదలకు అన్నం పెట్టుట, వికలాంగులకు, వయో వృద్దులకు తోడ్పడుట, విపత్తు లేర్పడినప్పుడు  ఆర్థికంగా ఆదుకొనుట, సహాయక చర్యలలో పాల్గొనుట, ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రుల సహాయ నిధికి  ఆర్థిక సాయాన్ని అందించుట మన అవోపా ప్రాథమిక బాధ్యతగా ఉన్నది. ఇప్పటికే మన అవోప శాఖలు టిఫిన్లు, భోజనం, మాస్క్ లు , గ్లోవ్స్ అందించడం, మొదలగు వివిధ రకాల సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతున్నది. కరోనా విపత్తు చాలా పెద్దది, భయంకర మైనది. పెద్ద ఎత్తున డబ్బు, సేవల అవసరం  ఉన్నది.  సీఎం రిలీఫ్ ఫండ్ కు, పీఎం రిలీఫ్ ఫండ్ కు మన బాధ్యతగా డబ్బు పంపవలసిన అవసరం ఉన్నది. ఖైరతాబాద్ లోని వాసవీ సేవా కేంద్ర ఆవరణలోని సంస్థలన్నీ కలిసి రోజూ 500 మంది పేదలకు మధ్యాహ్నం, రాత్రి అనగా 2 పూటలా అన్నదానం చేసే కార్యక్రమం మొదలైనది. అందుకు మనవంతు సాయం మనం అందించాలి.
     కావున అవోపా కార్యవర్గ సభ్యులంతా  ప్రతి ఒక్కరు ₹ 2000 రూ. కు తక్కువ కాకుండా క్రింద చూపిన మన avopa బ్యాంక్ అకౌంట్ కు గాని, గూగుల్ పే తో గాని, Bank  ద్వారా గాని డబ్బు పంపించి ఈ విపత్తు సమయంలో మన కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించుటకు సహాయ పడగలరని మనవి. అవోపా సభ్యులందరూ తమకు చేతనైనంత ఉదాహరణకు ₹500, ₹1000 లకు తక్కువ కాకుండా సాయం అందించాలని విజ్ఞప్తి చేయుచున్నాము.

Account Details:
Name of the Account:
Telangana Arya Vysya Officials and Professionals Association.
Savings BankAccount Number:
08712191039449
IFSC code : ORBC 0100871
Name of the Bank& Branch:
Oriental Bank of Commerce, Khairatabad branch

ఇట్లు
--  గంజి స్వరాజ్య బాబు,
    అధ్యక్షుడు.
--- నిజాం వెంకటేశం,
    ప్రధాన కార్యదర్శి
-- చింతా బాలయ్య,
    ఆర్థిక కార్యదర్శి.
-- పోకల చందర్,
   ముఖ్య సలహాదారు 
-- గుండా చంద్రమౌళి
   చీఫ్ కోఆర్డినేటర్
-- నూకా యాదగిరి,
    సంపాదకులు, న్యూస్ బులెటిన్
తెలంగాణ అ వోపా.
---