కల్నల్ సంతోష్ బాబు సతీమణి కి ఉద్యోగం ఇంటి ప్లాట్
June 23, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషిని కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ (గ్రూప్‌–1 కేడర్‌)గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సోమ వారం రాత్రి జీవో నంబర్‌ 80 జారీ చేశారు. ఆమె నియామకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించినట్లు పేర్కొన్నారు. ఆమె 30 రోజుల్లోగా సంబంధిత శాఖ కమిషనర్‌కు రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. ఈ జీవో ప్రకారం సంతోషి వేత నం రూ. 40,270/- –93,780/- వరకు ఉండనుంది. దీనికి అలవెన్స్‌లు అదనం. అయితే సంతోషి ఒకవేళ వేరే పోస్టును కోరుకుంటే ఆ విషయాన్ని రెండు రోజుల్లోగా తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. మరియొక జిఓ లో సంతోషికి 711 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ జీవో నంబర్‌ 59ను సీఎస్‌ విడుదల చేశారు. హైదరాబాద్‌ జిల్లాలోని షేక్‌పేట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 6/1, వార్డు నంబర్‌ 10, రోడ్డు నంబర్‌ 14 బంజారాహిల్స్‌లో కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషి పేరు మీద 711 గజాల స్థలం ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.