ఐసోలేషన్ వార్డుగా మారిన వైశ్య హాస్టల్... రాష్ట్ర ఆవోపా అభినందనలు
July 24, 2020 • Avopa News Bulletin

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో ముషీరాబాద్ లోని వాసవి ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాసవి శ్రీ గెల్లి నారాయణ చెట్టి విద్యార్థి వసతి గృహాన్ని త్వరలో ఆర్యవైశ్య కోవిడ్ పేషెంట్ల కోసం సకల సౌకర్యాలతో కూడిన ఐసొలేషన్ వార్డుగా మార్చుతున్నట్లు వైశ్య హాస్టల్ అధ్యక్షులు గంజి రాజమౌళి గుప్త, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్త ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ ప్రకటన పట్ల సామాన్య ఆర్యవైశ్య ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర avopa మరియు avopa న్యూస్ బులెటిన్ మరియు పలు ఆర్యవైశ్య సంఘాలు, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేయుచున్నారు.