ఈ వారం రాశి ఫలితాలు
November 1, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

వారఫలాలు

01st Nov 2020 నుండి 07th Nov 2020 వరకు

గమనిక:- 

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము.

... 

మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి మీ జాతక వివరాలను, తరునోపాయలను తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు.

..... 

మేష రాశి

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- 

ఈ వారం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లు అనుకున్న పనులు దక్కించుకుంటారు. వ్యాపారాలు కొంతమేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఓ కొలిక్కి వస్తుంది. పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో స్వల్పంగా చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు లక్ష్మీ నృసింహ స్తోత్రాలు పఠించండి.

 

 

వృషభ రాశి

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- 

ఈ వారం వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు కొంత తగ్గి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని పనులు చకచకా పూర్తి కాగలవు. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నూతన వ్యక్తుల పరిచయం. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. ప్రముఖులతో పరిచయాలు. గృహ నిర్మాణప్రయత్నాలు కలసివస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు ఉండే సూచనలున్నాయి.

 

 

మిథున రాశి

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- 

ఈ వారం ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంతమేర తీరతాయి. ఆప్తులు, మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. యుక్తితో కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఎంత కాలంగానో ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దగ్గరకు వస్తాయి.ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. కళారంగం వారికి అనుకున్న అవకాశాలు దక్కే సూచనలు. తొందరపాటు తనం వలన ఇంటాబయటా ఒత్తిడులు, సహనమే సౌభాగ్యంగా భావించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణుధ్యానం చేయండి.

 

కర్కాటక రాశి

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 

ఈ వారం ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. ప్రముఖులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితి ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ అనుకూలిస్తాయి.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలు పటించండి.

 

సింహరాశి

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. రాజకీయవర్గాల యత్నాలు కొలిక్కి వస్తాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. అందరిలోనూ సత్తా చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. కుటుంబంలో సమస్యలు ఉండే సూచనలున్నాయి సంయవనం పాటించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహస్తోత్రాలు పఠించండి. 

 

కన్యారాశి

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 

ఈ వారం పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు విస్తరించి లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు ఫలితం దక్కుతుంది. ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరులు, మిత్రులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. ఎంతటి వారినైనా వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

 

తులా రాశి:

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 

ఈ వారం వ్యాపారాలు మరింత సాఫీగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ హోదాలు కొంత పెరిగే సూచనలు. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కే సూచనలు. ఆర్థిక లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఇతరులకు సైతం చేయూతనందించి ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకు ఉపయుక్తమైన సమాచారం అందుతుంది. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు హనుమాన్‌ చాలీసా పఠించండి.

 

వృశ్చికరాశి

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 

ఈ వారం ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి తగినంత లాభాలు పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు అనూహ్యమైన ప్రగతి కనిపిస్తుంది. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. యుక్తి, పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొంత కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. అధిక ఆలోచనల వలన మానసిక అశాంతి.

 

ధనుస్సురాశి

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- 

ఈ వారం వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త విధులు కొంత ఇబ్బందిగా మారవచ్చు. రాజకీయ వర్గాలకు కొన్ని విమర్శలు ఎదురై నిరుత్సాహపడతారు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. రుణాలు కూడా చేయాల్సివస్తుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. మిత్రులతో మాటపట్టింపులు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమ తప్ప ఆశించిన ఫలితం కనిపించదు. భూ వివాదాలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు సవాలుగా నిలుస్తాయి. 

 

మకరరాశి

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 

ఈ వారం వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. కొత్త పనులు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఆదిత్య హృదయం పఠించండి.

 

కుంభరాశి

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక వర్గాలకు అనుకోని ఆహ్వానాలు. కొత్త పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు.బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొంతకాలంగా చికాకు పరుస్తున్న కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు రావి చెట్టుకు 27 ప్రదక్షిణలు చేయండి. 

 

మీన రాశి

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- 

ఈ వారం కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఇంటి నిర్మాణాల్లో కదలికలు ఉంటాయి. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతమైన కాలం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి రుణాలు తీరతాయి. ముఖ్యమైన పనులు నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. మిత్రులు, ఆప్తులతో ఆనందాన్ని పంచుకుంటారు. కొన్ని సమస్యలు వేధిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రాలు పటించండి.

గమనిక : 

ఈ వారం మంచి ఫలితాల కోసం అందరూ గణేశ మరియు దుర్గకు అర్చన చేయాలి