అవోపా హనుమకొండ వారిచే బంగారు పథకాల బహుకరణ
December 15, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

అవొపా హన్మకొండ వారిచే 2019 సంవత్సరం లొ తమ విద్య ను పూర్తి చేసుకున్న 61 మంది ప్రతిభ గల విద్యార్థులకు బంగారు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం అవోపా, హన్మకొండ అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్ ఆద్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో, వరంగల్ నగర ప్రథమ పౌరుడు శ్రీ గుండా ప్రకాశరావు గారి జ్యోతి ప్రజ్వలన చే ప్రారంభించడం జరిగింది. ఈ నాటి ఈకార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ మునుగోటి సత్యనారాయణ గారు, వ్వవస్థాపక ప్రధాన కార్యదర్శి శ్రీ పోకల చందర్ గారు, రాష్ట్ర అవోపా ప్రధాన కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశం గారు, TSNPDCL CGM Commercial శ్రీ బుస్సా అశోక్ గారు తదితరులు పాల్గొన్నారు. విద్యాకమీటి చైర్మన్ శ్రీ గంపా అశోక్ కుమార్ గారి ఎనలేని కృషి వలన, మరియు హనుమకొండ అవోపా కార్యదర్శి కొల్లూరు ప్రకాశం మరియు ఆర్థిక కార్యదర్శి అప్పారావు గారల చొరవతో ఈ కార్యక్రమం విజయవంతమైనదని అధ్యక్షులు తెలియజేయుచున్నారు. 

https://youtu.be/3kbzKMutBQM