అవోపా కల్వకుర్తి వారిచే వాసవి మాత దేవాలయానికి లక్ష రూపాయల విరాళం
July 11, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తేదీ 30. 6.2020 రోజున పదవీ విరమణ చేసిన అవోపా సభ్యులు,  శ్రీ విజయభాస్కర్ మరియు శ్రీ సాయి బాబు ఉపాధ్యాయులకు AVOPA కల్వకుర్తి వారు సన్మానము చేశారు.  తదుపరి వాసవి మాత దేవాలయంలో భక్తుల వస్తువులు భద్ర పరచడానికి లాకర్ లేక ఇబ్బంది పడుచున్న వేళ అది గమనించి లాకర్ ఏర్పాటుకు అవొప కల్వకుర్తి వారు రూ. 1, 00, 000 ఒక లక్ష రూపాయల చెక్ ను దేవాలయ ట్రస్టీ శ్రీ జులూరు రమేషుబాబు గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో Avopa కల్వకుర్తి అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.