అనాథ శరణాలయాలకు ఆర్థిక సహాయము
December 22, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

తేదీ 22.12.2019 రోజున అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ అధ్యక్షుడు పి.వి.రమణయ్య గారు, కె.వి.ఎస్.గుప్త, మాజీ వైశ్య బ్యాంకు చైర్మన్ మరియు బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ ప్రస్తుత ఎం.డి అయిన శ్రీ సదాశివ గుప్త గారితో కలిసి మాతృ అభయ ఫౌండేషన్ ను దర్శించామని అందులోనున్న వారి సంక్షేమానికి, నిత్యావసర వస్తువుల గురించి వారు రు.10,000 ల విరాళము అందజేశారని, తదుపరి మాతృ అభయ ఫౌండేషన్ ను దర్శించి అందులో నివసిస్తున్న పిల్లలను కలిసి వారి నిత్య భోజన వసతులకు గాను రు.10,000 లు అందజేసారని, పిదప బొడుప్పల్ లో నున్న ఆదర్శ అనాథ శరణాలయము ను దర్శించి అందులో నున్న పిల్లల బాగోగులు తెలుసుకుని వారికి మంచి ఆహారం, పండ్లు మొదలగు నిత్యావసర సరుకులు సమకూర్చమని అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ తరపున రు.2500 లు ఆ అనాథ శరణాలయ కార్యనిర్వహకునికి అందజేశామని అధ్యక్షుడు శ్రీ.పి.వి.రమణయ్య గారు తెలియజేయు చున్నారు.