కీ. శే. బిజినేపల్లి చక్రపాణి గారు, తేదీ 5.12.2024 రోజున తుది శ్వాస విడిచారు. చక్రపాణి గారు అవోపా హైద్రాబాద్ ఇమ్మిడియేట్ పాస్ట్ ప్రెసిడెంట్, మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడు. వీరు ఛార్టర్డ్ అకౌంటెంట్ గా నగరంలో స్థిరపడి చక్రపాణి & కో., స్థాపించి ఆడిట్ పనులు నిర్వహించేవారు. వీరికి చాలా సేవ సంస్థలతో అనుబంధము కలదు. వాసవీ క్లబ్ లో కూడా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వీరి అకాల మరణం అవోపా కు ఇతర సంఘాలకు తీరని లోటు. ఇంతటి సేవా తత్పరుడు, స్నేహశీలి, ఉత్థముడు, మృదుబాషి, వాసవీ మాత ముద్దుబిడ్డ శ్రీ బిజినేపల్లి చక్రపాణి గురించి తెలుసుకుందాం.
కి.శే బిజినేపల్లి చక్రపాణి గారు ఆగస్ట్ 5 1960 లో అనంతపూర్ లో ఒక సంపన్న వైశ్య శిఖమణులైన శ్రీమతి కమలమ్మ మరియు శ్రీ బలరాం దంపతులకు జన్మించారు. వీరి ప్రాథమిక విద్య రాజేంద్ర మున్సిపల్ స్కూల్, అనంతపురంలో, మాధ్యమిక విద్య సాయిబాబా స్టిల్ అల్ జూనియర్ కళాశాల, అనంతపురంలో మరియు ఉన్నత విద్య ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, అనంతపురం నిర్వహించి బీఎస్సీ లో పట్టభద్రులైనారు. తదుపరి ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇండియాలో చేరి C. A గా ఉత్తిర్ణుడై ఛార్టర్డ్ అకౌంటెంట్గా కార్యకలాపాలు నిర్వహిస్తూ చక్రపాణి & కో., అను సంస్థను స్థాపించి అందులో ప్రధాన భాగస్వామిగా పనులు నిర్వహించారు.
వీరు వారి ప్రధాన కార్యాలయపు పనులు నిర్వర్తిస్తూ పలు సంస్థల కార్యకలాపాలలో పలు పంచుకుంటూ అపరిమిత సేవ లందించారు. వీరు ICAI యొక్క SIRC యొక్క Hyd శాఖ చైర్మన్ గా 2006-07, 2008-09 సంవత్సరములలో, వైస్ప్రో ఇండియా 1998-2003 వరకు వ్యవస్థాపక కార్యదర్శిగా మరియు 2003 -2005 వరకు అధ్యక్షుడు గా సేవ లందించారు. వీరు లయన్స్ క్లబ్ లో సభ్యుడిగా చేరి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రశాంత్నగర్ శాఖకు అధ్యక్షుడు గా పనిచేశారు. వీరు రస్ట్ 324-C2 లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జోన్ చైర్మన్గా వ్యవహరించారు. వీరి సేవా భావాన్ని, స్నేహ తత్వాన్ని గ్రహించిన అలనాటి అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు వీరిని జీవితకాల సభ్యులుగా చేర్చుకుని వీరి సేవలను ఉపయోగించుకున్నారు. తదుపరి వీరి సేవా తత్పరతను గ్రహించిన సభ్యులు వీరిని అధ్యక్షునిగా ఎన్నుకొని వీరి సేవల్ని ఉపయోగించు కున్నారు. వీరు అవోపా హైద్రాబాద్ అధ్యక్షునిగా పనిచేస్తూ ఎలైట్ అండ్ NRI వధూవరుల వివాహాల గురించి ఆర్య వైశ్య వధూవరుల పరిచయ వేదిక ను అట్టహాసంగా హోటల్ తాజ్ కృష్ణాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేటి అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ రేణుకుంట్ల నమఃశివాయ గారు ప్రాజెక్ట్ ఛైర్మన్ గా వ్యవహరించారు. బిజినేపల్లి చక్రపాణి గారు AP ట్యాక్స్ బార్ అసోసియేషన్ లో జీవితకాల సభ్యుడుగా సేవలందించారు. వీరు చట్టబద్ధమైన ఆడిట్ , ట్యాక్స్ కన్సల్టెంట్, వ్యాట్ కన్సల్టెంట్, ఆడిటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆడిట్, ట్యాక్స్ రిటర్న్స్, మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్, కార్పొరేట్ ట్యాక్స్, స్టాట్యుటరీ అకౌంటింగ్ విభాగాలలో నిష్ణాతులు. వీరు తెలంగాణ రాష్ట్ర అవోపా కు ఆడిటర్ గా రెండు దశాబ్దాల కాలం సేవ లందించారు. ప్రస్తుతం వీరు తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడిగా సేవ లందించారు. వీరి మరణం అవోపాలకు తీరని లోటు.
కీ. శే. బిజినేపల్లి చక్రపాణి గారికి నివాళులర్పిస్తూ వీరి ఆత్మ శివైఖ్య మొందాలని, వీరి కుటుంబ సభ్యులకు ప్రశాంతత చేకూరాలని
తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షులు మలిపెద్ది శంకర్, ప్రధాన కార్యదర్శి పోలా శ్రీధర్, ఆర్థిక కార్యదర్శి కందికొండ శ్రీనివాస్,
అడిషనల్ ప్రధాన
కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, అవోపా న్యూస్
బులెటిన్ సంపాదకులు నూక యాదగిరి, కమిటీల సభ్యులు,
సలహాదారులు, అవోపా హైద్రాబాద్ అధ్యక్షుడు రేణుకుంట్ల నమఃశివాయ, ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఆర్థిక కార్యదర్శి మాకం బద్రీనాథ్, కమిటీ సభ్యులు, సలహాదారులు హృదయపూర్వకంగా భగవంతుణ్ణి
ప్రార్థిస్తున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి