డా. కొణిజేటి రోశయ్య గారి 3వ వర్ధంతి మరియు సంస్మరణ సమావేశము


డా. కొణిజేటి రోశయ్య గారి 3వ వర్ధంతి మరియు సంస్మరణ సమావేశము

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డా|| కొణిజేటి రోశయ్య గారి 3వ వర్ధంతి కార్యక్రమం తేదీ 4.12.2024 రోజున హైటెక్స్ లోని హాల్ నెం.4 లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని డా|| కొణిజేటి రోశయ్య మెమోరియల్ ఫోరం మరియు ఫెడరేషన్ ఆఫ్ అవోపాస్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, గౌరవ అతిథులుగా  శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు,  శ్రీ బొగ్గారపు దయానంద్ గారు, ఎమ్మెల్సీ,  శ్రీ ధనపాల్ సూర్యనారాయణ గారు, ఎమ్మెల్యే, శ్రీమతి కల్వ సుజాత గుప్త గారు, చైర్పర్సన్, తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్,శ్రీ బిగాల గణేష్ గుప్త గారు, మాజీ ఎమ్మెల్యే, శ్రీ కోలేటి దామోదర్ గారు. మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ర్ట పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు, అధ్యక్షుడు, అంతర్జాతీయ వైశ్య సమాఖ్య, శ్రీ కొండ్లె మల్లికార్జున్ గారు., ఎల్టిసిఏ, వాసవి సేవా కేంద్రం, శ్రీ రేణుకుంట గణేష్ గుప్త గారు, ఆర్గనైజింగ్ సెక్రటరి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, శ్రీమతి ఉప్పల శారద గారు,  శ్రీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు తెలంగాణ రహదారులు, భవనాలు శాఖమాత్యులు, శ్రీ టి.జి వెంకటేష్ గారు,  మాజీ రాజ్యసభ సభ్యులు, ఆత్మీయ అతిథులుగా శ్రీమతి ఉప్పల రాజ్యాలక్మి అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ మహిళా విభాగం, శ్రీ ఇరుకుల్ల రామకృష్ణ గారు,  అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య యువజన సంఘం, శ్రీ రాజు. మడిపడిగ గారు, వ్యవస్థాపకులు, విబిజి, శ్రీ శ్రీరాం రాజగోపాల్ గారు (తాతయ్య) ఎమ్మెల్యే, శ్రీ శిద్దా రాఘవ రావు గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి,  శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి,  శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు, ఎ.పి. మాజీ డిప్యూటీ స్పీకర్, శ్రీ దూండి రాకేష్ గారు, చైర్మన్, ఎ.పి. ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి సంస్థ, శ్రీ అన్నా వెంకట రాంబాబు గారు, మాజీ ఎమ్మెల్యే,  శ్రీ అంబికా కృష్ణ గారు, మాజీ ఎమ్మెల్యే, శ్రీ మద్దాళి గిరిధర్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే,  శ్రీ కొట్రిక మధుసూధన్ గుప్త గారు, మాజీ ఎమ్మెల్యే, శ్రీ టి. రాంబాబు గారు. అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవోపా, శ్రీ మలిపెద్ది శంకర్ గారు. అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్ర అవోపా,  శ్రీమతి ఉప్పల రాజ్యలక్ష్మి గారు, అధ్యక్షురాలు. అంతర్జాతీయ వాసవీ మహిళా సమాఖ్య గారలు హాజరైనారు. 

ఈ కార్యక్రమానికి  సభాధ్యక్షులు గా శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మరియు సీఏ బెల్డి శ్రీధర్ గారు జాతీయ అధ్యక్షుడు, ఫెడరేషన్ ఆఫ్ ఆవోపాస్ ఆఫ్ ఇండియా గారలు వ్యవహరించారు. 

ఈ కార్యక్రమంలో డా॥ కొణిజేటి రోశయ్య కుమారులు కొణిజేటి శివ సుబ్బారావు, కొణిజేటి శ్రీమన్నారాయణ మూర్తి, అల్లుడు పైడా కృష్ణ ప్రసాద్. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డా|| కొణిజేటి రోశయ్య మెమోరియల్ ఫోరం కార్యవర్గ సభ్యులు బండారు సుబ్బారావు, పొట్టి వెంకటేశ్వర్లు, ఎస్. శివరామ సుబ్రహ్మణ్యం, యెర్రం విజయ్ కుమార్, చక్కా మురళీ మోహన్, చలవాడి ప్రసాద్, బూరుగు రవి కుమార్ గుప్త, కామిశెట్టి అనిల్కుమార్, మట్టే శ్రీనివాస్, కె.వి.ఎస్ ప్రకాష్ (కాశీ), మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, ఫెడరేషన్ ఆఫ్ అవోపాస్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏఐ)  సెక్రటరీ జనరల్ కనమర్లపూడి కోటేశ్వరరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి మేడా నర్సింహులు మరియు డా॥ కొణిజేటి రోశయ్య ఆత్మీయులు, సన్నిహితులు, రెండు తెలుగు రాష్ట్రాల ఆర్యవైశ్య సేవా సంస్థల కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ బెల్ది శ్రీధర్ FAI అధ్యక్షులు గారు మాట్లడు చూ  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్యగారి 3వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ హైటెక్స్ లోని హాల్ నెంబర్ 4లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున్న డా|| కొణిజేటి రోశయ్య మెమోరియల్ ఫోరం మరియు ఫెడరేషన్ ఆఫ్ అవోపాస్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఐ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని నేషనల్ ప్రెసిడెంట్ బెల్టి శ్రీధర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డా|| కొణిజేటి రోశయ్య విలువలను స్ఫూర్తిని, చైతన్యాన్ని గుర్తు చేసుకుంటూ అందరూ అదేవిధంగా ఎదగాలని కోరుకుంటూ ఈ 'చైతన్య స్ఫూర్తి' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని చేయాలని తలపెట్టగానే డా॥ కొణిజేటి రోశయ్య మెమోరియల్ ఫోరం సభ్యులు సీల్వెల్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ బండారు సుబ్బారావు, ఆర్. ఎస్. బ్రదర్స్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మరియు తదితర సభ్యులు ముందుకు వచ్చిన తరువాత ఫెడరేషన్ ఆఫ్ అవోపాస్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందుకు వచ్చామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, గౌరవ అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు టి.జి. భరత్, జీఎన్ఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జునరావు, ఆత్మీయ అతిథులుగా ఆర్యవైశ్య ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ శాసనసభ్యులు, రెండు తెలుగు రాష్ట్రాల ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్లు, వివిధ ఆర్యవైశ్య సేవా సంస్థల నాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేశారని అలాగే ఈ సందర్భంగా విద్యారంగం, సేవా రంగం, బిజినెస్ రంగంలో రాణించి ముందంజలో ఉన్నవారి ప్రతిభను గుర్తించి వారిని డాక్టర్ కొణిజేటి రోశయ్య స్పూర్తి అవార్డుతో సత్కరించామని, ఈ సందర్భంగా డా॥ కొణిజేటి రోశయ్య మెమోరియల్ ఫోరం తరుపున ఆర్థికంగా అవసరాలు ఉన్న వారిని గుర్తించి ఆర్థిక సహాయం, వేద పాఠశాల గురుకులానికి మరియు బ్లైండ్ స్కూల్కు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని, ఈ కార్యక్రమంలోనే సుమారు 14 వందల మంది స్పెషాలిటీ వైశ్య వైద్యుల పేరు, చిరునామా, సంప్రదించాల్సిన నెంబర్ వారి పూర్తి వివరాలతో కూడిన క్యూఆర్కోడ్, వారి ఫోటోతో సహా ప్రింట్ చేయబడిన 'నేషనల్ వాసవి డాక్టర్స్ డైరెక్టరీ' అతిథుల చేతులమీదుగా ఈ సమావేశంలో విడుదల చేశారు. ఈ డైరెక్టరీలో 11 రాష్ట్రాలలో ఉన్న వైశ్య వైద్యుల వివరాలు అందుబాటులో ఉంచబడ్డాయని ఈ డైరెక్టరీ ప్రచురణకు ఫెడరేషన్ ఆఫ్ అవోపాస్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ బెల్టి శ్రీధర్, సెక్రటరీ జనరల్ కనమర్లపూడి కోటేశ్వరరావు, కమిటీ మెంబర్స్ రమేష్ కె. గ్రంథి, జి, నంబెర్ మల్లు, రాజేంద్రప్రసాద్, డి. నరేష్, డా॥ నాగనంధిని మరియు అన్ని రాష్ట్రాల నుండి కో-ఆర్డినేటర్స్, డాక్టర్ కో-ఆర్డినేటర్స్ కొన్ని నెలలు శ్రమించి ఈ డైరెక్టరీని రూపొందించడం జరిగిందని, అత్యవసరమైన ఈ డైరెక్టరీని ఎఫ్ఎఐ అవోపావారు అన్ని వైశ్య సంస్థలకు, ట్రస్టులకు, దేవాలయాలకు, అన్నదాన సత్రాలకు, హాస్టల్స్కు, వైశ్య పత్రికల వారికి ఉచిత ఆవిష్కరించినరోజే అందజేయబడుతుందని. ప్రతి సంస్థ తరుపున వారి అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారులు డిసెంబర్ 4న జరిగే కార్యక్రమంలో పాల్గొని ఈ డైరెక్టరీని తీసుకొని వారి సంస్థలో ఉంచి, సమాజంలోని అందరి సభ్యులకు ఈ డాక్టర్ను వివరాలు అందుబాటులో ఉంచగలరని, డిసెంబర్ 4 నాడు ఈ డైరెక్టరీని అన్ని వైశ్య సంస్థలకు ఎఫ్ఎఐ- అవోపా ద్వారా ఉచితంగా ఇవ్వబడుతుందని తెలియజేశారు.  కనిపించే దైవం వైద్యుడని ఎవరైన ఈ డైరెక్టరీ పొందాలనుకుంటే వారు రూ॥ 1200/- చెల్లించి గోగుల్ ఫామ్లో వారి వివరాలు పొందబర్చగలరని దీనికి సంబంధించిన వివరాలు ఈ క్రింది వైబ్సైట్లో పొందుపర్చామని ఫెడరేషన్ ఆఫ్ అవోపాస్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ బెల్డి శ్రీధర్ తెలియజేశారు.(www.fai-avaopa.org)

డా. రోశయ్య గారి 3వ వర్ధంతి మరియు సంస్మరణ సమావేశము వీడియో

 హైదరాబాదులో మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా వనపర్తి  ఆర్యవైశ్యులు  బచ్చు వెంకటేష్ న్యాయవాదులు రాజ్ కుమార్ విజయ భాస్కర్ మరియు గోవర్ధన్ మహేష్ రమేష్ సురేష్ వంశీ జితేందర్ తదితరులు పాల్గొని రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత రోశయ్య ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని వారి పేర్కొన్నారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో  మంత్రివర్గంలో వివిధ శాఖలు చేపట్టారని వారు గుర్తు చేశారు



కామెంట్‌లు