18.2.2024 రోజున విశ్రాంత డిప్యూటీ రిజిస్ట్రార్, భావనా బ్యాంక్ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మెంబర్, అవోపా న్యూస్ బులెటిన్ సంపాదకులు, అవోపా హైదరాబాద్ మరియు అవోపా హబ్సిగూడాల సలహాదారు శ్రీ నూక యాదగిరి 75 వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ రామంతాపూర్ లోని హోటల్ కినారా గ్రాండ్ లో పుష్పమాలాంకృతమైన రంగురంగుల విద్యుత్ దీపాల కాంతిలో వినువిందైన శ్రావ్యమైన సంగీత ఝరిలో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను వారి పెద్ద కుమారుడు అమెరికా నివాసి నూక నాగరాజు, అమెరికా నివాసి కుమార్తె అనురాధ వారి భర్త కందుకూరి రాజేశ్వర్, హైదరాబాద్ నివాసి చిన్నకుమారుడు నూక పూర్ణ చందర్ కోడలు శాంతి బంధువుల, చిన్ననాటి మిత్రుల, సహోద్యోగుల, సహపాఠీల మరియు నివాసిత కాలనీ మరియు అపార్ట్మెంట్ వారల సుమక్షంలో ప్రేమ పూర్వక అభినందనలతో నిండిన ఆహ్లాదకరమైన వాతావరణం లో గొప్పగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్ గ్రహీత శ్రీ మాడిశెట్టి గోపాల్ వ్యాఖ్యాత గా కార్యక్రమాన్ని క్రమశిక్షణతో నిర్వహించి వన్నె తెచ్చారు. నుకాయాదగిరి గారిని కుమారులు కుమార్తెలు మంగళ వాయిద్యాల తో శ్రవణా నంద సంగీతం సన్నగా హృదయాంతరాళ్లను మీటుతుండగా ప్రేమానురాగాలతో వేదిక పైకి తీసుకువచ్చి పాదాభివందనాలతో నూతన వస్త్రాలతో వారిని సన్మానించి తండ్రి ఆశీర్వాదం పొందారు. తదుపరి బిర్లామందిర్ పూజారులు శ్రీనివాసుని అలంకరించిన పుష్పమాలతో వేద మంత్రాలతో వేదాశిస్సులు నొసంగారు. వేద పండితుల మంత్రోఛ్చారణతో సమావేశ మందిరం మార్మోగింది. కూర చిదంబరం గారిని ఆహ్వానించగా వారి వేదిక పైకి విచ్చేసి సన్మానపత్రం చదివి అందించారు. ఆహ్వానితులను వరసగా వ్యాఖ్యాత గారు ఆహ్వానించగా వేదికపైకి విచ్ఛేసి వారి అనుబంధ పూర్వక గత స్మృతులతో నూక యాదగిరి గారికి హృదయపూర్వక అభినందనలతో చిరు కానుకలతో, పుష్పగుచ్చాలతో సత్కరించారు. సన్మానగ్రహిత తనను అభినందించిన బందువులకు, మిత్రులకు, కార్యక్రమము విజయవంతంగా నిర్వహించిన కుటుంబ సభ్యులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. పిదప ఏర్పాటు చేసిన మృష్టాన్న భోజనమారగించి సేదదీరి అయోధ్య బాలరాముని చిత్రపటాన్ని నిర్వాహకులు రిటర్న్ గిఫ్ట్ గా అందించి విడ్కోలు పలికారు.
75వ జన్మదిన శుభాకాంక్షలు
డా. కృష్ణారావు,కందికొండ శ్రీనివాస్,కట్ట రవి మరియు ప్రశంసా పత్రము చదువుచున్న శ్రీ కూర చిదంబరం గారు
కూర చిదంబరం గారు సమర్పించిన ప్రశంసా పత్రము
నాగరాజు, అనురాధ మరియు పూర్ణ చందర్
నాగరాజు, అనురాధ మరియు పూర్ణ చందర్ వేదిక పైకి తీసుకువస్తున్నారు అనురాధ భవాని తో
కో బ్రదర్స్ రాధాకృష్ణమూర్తి మరియు నాగభూషణం గారల కుటుంబ సభ్యులతో కుమారులు, కుమార్తె పుష్పగుచ్చమందించు చిత్రం
నూక నాగరాజు మేనత్త బుజ్జమ్మ తో
అల్లపల్లి భారతమ్మ కోడలు విజయ మరియు సునీల్ తో
వేద పండితులు కుటుంబ సభ్యులకు వేదశీర్వాదం నొసంగుట
వేద పండితులు యాదగిరి గారికి వేదశీర్వాదం నొసంగుట నాగరాజు, పూర్ణచందర్ మేన మామలు, వాసు, నారాయణరావు లతో
వేదిక
కాలకోట వాసు కుటుంబ సభ్యులతో
కో బ్రదర్స్ రాధాకృష్ణమూర్తి మరియు నాగభూషణం గారల కుటుంబ సభ్యులతో నాగరాజు సంకీస రాజు కుటుంబ సభ్యులతో
నూక యాదగిరి కుమార్తె అనురాధ, అల్లుడు రాజేశ్వర్, నాగరాజు మరియు పూర్ణచందర్ కుటుంబ సభ్యులతో
బ్రదర్స్ అండ్ సిస్టర్
నూక యాదగిరి కుమార్తె అనురాధ, అల్లుడు రాజేశ్వర్, నాగరాజు మరియు పూర్ణచందర్, కోడలు శాంతి, మనుమ రాండ్లు ఉదయ హాసిని మరియు నిత్యానంది నిలతో
అనురాధ
బర్త్ డే కేకు
కుటుంబ సభ్యులతో
వేద పండితులు శ్రీనివాసుని ప్రసాదము అందించుట
అనూరాధ ప్రవేశ ద్వారం వద్ద గెస్ట్ లను ఆహ్వానించుట
కో బ్రదర్స్ రాధాకృష్ణమూర్తి మరియు నాగభూషణం మరియు బావమర్డులు వాసు నారాయణ రావు గారల కుటుంబ సభ్యులతో
నాగరాజు వాసు నారాయనరావులతో
నూక నాగరాజు
రాధాకృష్ణమూర్తి, రాజు కుటుంబ సభ్యులతో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి