అభినందనలు

 తేదీ 29.10.2023 రోజున రామప్పను సందర్శించిన హబ్సిగూడ అవొపా బృందం

ఇటీవల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఆవోపా హబ్సిగూడ సభ్యులు 40 మంది ములుగు జిల్లాలోని పాలంపేటలో ని శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర దేవాలయం సందర్శించి దేవాలయ గైడ్ తెలియజేసిన గుడి యొక్క వివరాలను ఆలకించి కాకతీయుల కట్టడాల యొక్క ప్రావీణ్యతను ఆనాటి శిల్పకలను చూసి ఆశ్చర్య చకితులయ్యారు. దేవాలయ చరిత్రను మరియు దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ఇటికల యొక్క ప్రాముఖ్యతను, ప్రత్యేకతలను తెలుసుకున్న తర్వాత వారు ఆనాటి శిల్పులను కాకతీయ రాజులను అభినందించారు. అంతకు ముందు వారు కాజిపేట్ లోని శ్వేతార్క గణపతి దేవాలయమును, వేయి స్తంభాల దేవాలయమును, భద్రకాళి మాత దేవాలయమును తదుపరి ములుగురోడు లోనున్న శ్రీశ్రీశ్రీ వాసవిమాత దేవాలయమును దర్శించుకుని దేవాలయ కమిటి ప్రధాన కార్యదర్శి శ్రీ అంచూరి శ్రీనివాస్ గారు అమ్మవారి దర్శనం గావించి మధ్యాహ్న భోజనం రాత్రి అల్పాహారం అందించి అందరినీ ఆహ్లాద పరచారు. ఈ  కార్యక్రమంలో హబ్సిగూడ అవోప ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ గారు, ఆర్థిక కార్యదర్శి మాచర్ల శ్రీనివాస్ రావు గారు, దివ్వెల శ్రీనివాస్ గారు, రామలింగేశ్వర రావు, అంచూరి శ్రీనివాస్ గారు, తెలంగాణ అవొపారాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిరూప సతీష్ కుమార్ ములుగు అవోపా అధ్యక్షులు కొండ్లె కృష్ణమూర్తి ప్రధాన కార్యదర్శి తోడుపునూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అవోపా హబ్సిగూడా ప్రాధాన కార్యదర్శి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు మరియు నిర్వాహకులు తమను సాదరంగా ఆహ్వానించి వాసవీ అమ్మవారి దర్శనం గావించిన దేవస్థాన ప్రధాన కార్యదర్శి శ్రీ అంచూరి శ్రీనివాస్ గారికి, ములుగు అవోపా అధ్యక్షులు శ్రీ కొండ్లె కృష్ణమూర్తి గారికి,  రాష్ట్ర అవోపా కార్యవర్గ సభ్యులు శ్రీ శిరూప సతీష్ కుమార్ ములుగు అవోపా ప్రధాన కార్యదర్శి తోడుపునూరి కిషోర్ గారికి మరియు సంధాన కర్తగా అన్ని ఏర్పాట్లు గావించిన అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూక యాదగిరి గారికి రాష్ట్ర అవోపా సలహాదారు పోకల చందర్ గారికి  హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 





 


కామెంట్‌లు