తేదీ 15.10.2023 రోజున వెనిశెట్టి జగదీశ్వరయ్య స్మారక సేవాసమితీ వారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్ధుడు శ్రీ వెనిశెట్టి రవికుమార్ అధ్యక్షతన హన్మకొండలో నిర్వహించిన కార్యక్రమములో APJ అబ్దుల్ కలామ్ నేషనల్ లేవల్ టీచింగ్ ఎక్సలెన్సి అవార్డ్ - 2023 కి ఎంపికై న ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. అందులో తెలుగు పండిట్, ZPHS పాలంపేట మరియు అవోప ములుగు యూనిట్ అధ్యక్షులు శ్రీ కొండ్లె కృష్ణమూర్తి గారిని కూడా సన్మానించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన కో-అపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ (జిల్లా జడ్జి) శ్రీ వై. సత్యేంద్ర గారి చేతులమీదుగా అవార్డ్ ను అందజేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ సర్కిల్ ఇనస్పెక్టర్ శ్రీ అబ్బయ్య గారు, గెస్ట్ ఆఫ్ హానర్ గా శ్రీమతి అంజనీకుమారి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ కోర్ట్స్, ప్రత్యేక అతిథిగా లయన్స్ క్లబ్ గవర్నర్ మరియు పూర్వ అవోపా హనుమకొండ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ పోకల చందర్ గారు, మరొక అతిథి డి.ఆర్ అకాడమీ ఎం.డి పి.దేవేందర్ రెడ్డి గారు, రాష్ట్ర అవోపా ఆర్థిక కార్యదర్శి శ్రీ కందికొండ శ్రీనివాస్, మడుగురి నాగేశ్వరరావు, శిరుప సతీష్ కుమార్, ములుగు యూనిట్ ప్రధాన కార్యదర్శి తొడుపునూరి కిషోర్, కోశాధికారి యాదా నాగరాజు , ఉపాధ్యక్షులు పడమటింటి నగేష్ గారలు తదితరులు హాజరై అవార్డ్ గ్రహితను అభినందించారు.
అభినందనలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి