లక్ష తులసి మొక్కల పంపిణీ కార్యక్రమం బై ఫెడరేషన్ ఆఫ్ పారిస్ ఆఫ్ ఇండియా (FAI)
FAI వారు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లోని 27 సెంటర్లో ఈ లక్ష తులసి మొక్కల ( మెడిసినల్ ప్లాంట్స్) పంపిణీ కార్యక్రమాన్ని 5 సెప్టెంబర్ 2021 నాడు ఎమ్మెల్యే శ్రీ బీగాల గణేష్ గుప్తా గారు , మరియు ఐ ఎఫ్ ఎస్ ఆఫీసర్ N Kshthija gari కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చేతుల మీదుగా వైస్ప్రొ భవన్ పంజాగుట్ట నందు ప్రారంభించారు .
ఈ ప్రారంభం తరువాత ఈ 27 ప్రాంతాలలో వారు వారి వారి లోకల్ లీడర్స్ ద్వారా తులసి మొక్కల కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు.
ఈ తులసి మొక్కల కార్యక్రమం ఐదో తారీకు నుండి తొమ్మిదవ తారీకు వరకు ఉంటుంది.
FAI వివిధ సంస్థలను చారిటబుల్ ట్రస్ట్ లను పాఠశాలలను భాగస్వాములుగా చేసి ఈ లక్ష తులసి మొక్కలు పంపిణీ చేయటం జరిగింది.
ఈ మొక్కలు తీసుకొని వెళ్ళటానికి వీలు గా ఒక పర్యావరణ స్థితులకు లోబడి ఉండే బ్యాగ్స్ లో అందరికీ అందజేయబడింది.
ఈ కార్యక్రమానికి సహాయం అందించిన వారు వైష్ణవ అర్బన్ గ్రీన్స్ విజయ్ కుమార్ గారూ, జిహెచ్ఎంసి, బండారు సుబ్బారావు గారు సీఎం డి sealwel కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, రవీంద్ర కుమార్ అగర్వాల్ గారు సీఎండి దివ్య శక్తి ప్రైవేట్ లిమిటెడ్ , సుంకు బాలచంద్ర ఫౌండర్ అభయ పౌండేషన్ .
FAI జాతీయ అధ్యక్షుడు BELDI శ్రీధర్ గారు తులసి మొక్క ప్రాముఖ్యతను గురించి ఔషధ గుణాల గురించి మొక్క దగిన మొక్క అని ఆరోగ్యప్రదాయిని అని అందరికీ ZOOM వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చక్కగా వివరణ ఇచ్చారు. అందరిని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొనమని సందేశం ఇచ్చారు.
ఇంకా సుమారు 25 ప్రాంతాలలో పంపిణీ చేయటానికి ఆసక్తి చూపుతున్న సంస్థల గురించి తెలిపారు. వారందరికి కూడా రెండవ విడత ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కలిగించటానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ రెండవ విడత కార్యక్రమం 15, 20 రోజుల్లో ప్రారంభం కానున్నదని తెలియజేశారు.
ఈ సందర్భంగా అలేఖ్య పాలడుగుల ను జూనియర్ సివిల్ జడ్జిగా slect అయినందుకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సన్మానించారు.
మీటింగులో వివిధ ప్రాంతాలలో పంపిణీ చేస్తున్న సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో అభిప్రాయాలను తెలిపారు. ఈ లక్ష తులసిమొక్కల పంపిణీ కార్యక్రమం అమోఘమైన దని అత్యవసర మైనదని అందరూ ఎఫ్ ఏ ఐ ను అభినందించారు.
ప్రాజెక్టు చైర్మన్ గ్రంధి రమేష్ కుమార్ సెక్రటరీ జనరల్ కే కోటేశ్వరరావు సంక నారాయణ మూర్తి ఇంకా ఇతర ఆఫీస్ బేరర్స్ ఈసీ మెంబర్స్ ఈ కార్యక్రమంలో భౌతికంగా పాల్గొన్నారు. ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కార్యక్రమ ఫోటోలు వీక్షించగలరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి