తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గ సమావేశంలో పలువురికి సన్మానాలు మహాజన సభ నిర్వహణ తేదీ నిర్ణయం

 


తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గ సమావేశము తేదీ 18.7.2021 రోజున ఉ.11 గం. లకు ముషీరాబాద్ లోని ఆర్యవైశ్య హాస్టల్ వసతి భవనం సమావేశ మందిరంలో జరిగినది. ఈ సమావేశంలో అజెండా అంశాలను క్షుణ్ణంగా చర్చించినారు. తదుపరి అవోపా న్యూస్ బులెటిన్ చందాదారుల కమిటీ చేర్మన్ శ్రీ ఎం.ఎన్.రాజకుమార్ గారు  అవోపా వనపర్తి మరియు స్థానికుల సహాయముతో, సుమారు 12 పెళ్లిళ్లు బుల్లెటీన్లో ప్రచురించినందులకు జరిగినవని కార్పస్ ఫండ్ సమికరణతో సుమారు 40 వేల విలువైన కంప్యూటర్ ను అవోపా న్యూస్ బులెటిన్ అవసరార్థం బహూకరించారు. అందరినీ సమీకరించి అవోపా న్యూస్ బులెటిన్ కు విశేష ఆదరణ కల్పించి సుమారు 38 మందిని బులెటిన్ చందా దారులుగా చేర్పించి వ్యాపార ప్రకటనలను ఇప్పించి సేవచేయుచున్న శ్రీ ఎం.ఎన్.రాజకుమార్ గారికి సమావేశము కృతజ్ఞతలు తెలియజేసింది. 

తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యాలయములో సుమారు 15 సంవత్సరములు కార్యాలయ సహాయకునిగా పనిచేసిన రవికుమార్ అనారోగ్యం వలన బాధపడుచున్న తరుణంలో వారికి సుమారు రూ.14,500 ల ఆర్థిక సహాయము చేయడం జరిగినది. 

అవోపా న్యూస్ బులెటిన్ గురించి వివరించ వలసినదిగా ప్రధాన కార్యదర్శి కోరగా అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ శ్రీ నూక యాదగిరి గారు అవోపా న్యూస్ బులెటిన్ కు వార్తాపేపరుల రిజిస్ట్రార్ గారు  లైసెన్స్ మంజరి చేసి విధించిన శరతులను గూగుల్ వారు ఉచితంగా బహుకరించిన అవోపా బులెటిన్ డాట్ పేజీ గురించి వివరిస్తూ రోజు వారీ వార్తలను విధిగా ప్రచురించాలని, నెలకు కనీసం 10000 ల మంది ఆ పేజీని క్లిక్ చేసి దర్శించాలని లేనిచో వెబ్సైట్ అనుమతులను రద్దు చేయగలరని వివరిస్తూ అవోపా న్యూస్ బులెటిన్ నిర్వహణకు తగిన ఆర్థిక సహకారం అందించాలని, అందులకు చందాదారులను  చేర్పించి వ్యాపార ప్రకటనలు  విధిగా సేకరించి పంపించాలని కార్యవర్గాన్ని మరియు అందరు అధ్యక్ష కార్యదర్శులను కొరినారు. 

అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ శ్రీ నూక యాదగిరి గారు తెలంగాణ రాష్ట్ర అవొపాకు అవోపా న్యూస్ బులెటిన్ ద్వారా 2016 నుండి విశేష సేవాలందిస్తున్నారని మరియు అవోపా నాగర్ కర్నూలు వారి 11వ వివాహ పరిచయ వేదిక విజయవంతం అగుటలో కూడా వారు బులెటిన్ లో ప్రచురించి తగు ప్రాచుర్యం కల్పించి సహాయము అందించారని,  అవోపా నగర్ కర్నూలు వారు తేది 18.7.2021 రోజున ముషీరాబాద్ లోని ఆర్యవైశ్య హాస్టల్ సమావేశ మందిరంలో వారిని శాలువాతో మొమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అవోపా నాగర్ కర్నూలు అధ్యక్షుడు శ్రీ బిళ్లకంటి రవికుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీ కంది శ్రీనివాస్, ఆర్థిక కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షులు శ్రీ మలిపెద్ధి శంకర్ గారు, శ్రీ పోల శ్రీధర్ గారు, శ్రీ కలకొండ సూర్యనారాయణ గారు డాక్టర్ నాగరాజు గారు తదితరులు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్య బాబు, ప్రధాన కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశం, ఆర్థిక కార్యదర్శి శ్రీ చింత బలయ్య, పూర్వ అవోపా అధ్యక్షుడు శ్రీ కాసం అంజయ్య ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్, చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ గుండా చంద్రమౌళి, సలహాదారు డాక్టర్ మారం లక్ద్మయ్య మరియు వివిధ జిల్లా అవొపాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రముఖ పత్రికా విలేఖరులు తదితరుల సమక్షంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. హాజరైన పలువురు వారి సేవలను ప్రశంసించారు. వేదిక పై ఆశీనులయిన మాజీ అధ్యక్షుడు శ్రీ కాసం అంజయ్య, అధ్యక్షుడు శ్రీ స్వరాజ్యబాబు, ప్రధాన కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశం, ఆర్థిక కార్యదర్శి శ్రీ చింత బాలయ్య, ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్, చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ గుండా చంద్రమౌళి, సలహాదారు డాక్టర్ మారం లక్ష్మయ్య గారలను కూడా అవోపా నాగర్ కర్నూలు వారు సన్మానించారు. మధ్యాన్న భోజనానంతరము సన్మాన కార్యక్రమాలు ముగిసిన తర్వాత మహాజన సభ నిర్వహణ తేదీ 1.8.2021 రోజున మహబూబ్నగర్ పాలకొండలోని వాసవీ గార్డెన్స్ లో జరుపుటకు నిర్ణయించి, ప్రస్తుత కమిటీ పదవీ కాలం ముగిసి నందున ఎన్నికలు జరపాలని నిర్ణయించి ఎన్నికల అధికారిగా శ్రీ పోకల చందర్ గారిని సహాయ ఎన్నికల అధికారిగా శ్రీ కలకొండ సూర్యనారాయణ గారిని నియమించడమైనది.  ప్రధాన కార్యదర్శి వందన సమర్పణతో జాతీయ గితాలా పణతో సమావేశము ముగిసింది. 


కామెంట్‌లు