అవోపా కామారెడ్డి వారిచే నిత్యావసర సరుకుల పంపిణీ

 

కామారెడ్డి పట్టణంలోని కోవిడ్ బాధితులకు  మధ్యాహ్నం మ‌రియు రాత్రి పూట ఆహారాన్ని అందిస్తున్న యాద శ్రీనివాస్ గారికి కామారెడ్డి ఆర్య‌వైశ్య‌ అఫీషియ‌ల్స్ & ప్రొఫెష‌న‌ల్స్ అసోసియేష‌న్ (AVOPA) తరఫున ఒక రోజుకు అవసరమైన కూరగాయలను అ‍ంద‌చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అవోపా కామారెడ్డి అధ్యక్షులు వి.సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి తృప్తి శ్రీనివాస్, ఆర్థిక కార్యదర్శి గంగా ప్రసాద్ మరియు మురళి, సుబ్బారావు, ఎం.సంతోష్, కొమ్మ శ్రీనివాస్, బి.సంతోష్  అవోపా కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. సుమారు గత నెల రోజులుగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యాద శ్రీనివాస్ గారిని అవోపా కామారెడ్డి త‌ర‌ఫున‌ శాలువాతో సత్కరించి వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ,అందుకు అవోపాఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందని ప్రోత్సహించడం జరిగింది. ఈ సందర్భంగా అవోపా అధ్యక్షులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో సేవా దృక్పథంతో ముందుకు వచ్చి యాద శ్రీనివాస్ చేస్తున్నటువంటి కార్యానికి తమ వంతు సహకారాన్ని అందించే అవకాశాన్ని కల్పించడం ఆనందదాయకమైన విష‌య‌మ‌ని, సమాజసేవకు స‌హ‌క‌రించిన‌ అవోపా స‌భ్యుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియజేయడం జరిగింది.

కామెంట్‌లు