తేదీ 7.6.2021 రోజున కోదాడ లోని కాశీనాథం ఫంక్షన్ హాల్ లో 18 సంవత్సరాల నుండి 94 సంవత్సరాల వృధ్ధులకు అవోపా కోదాడ వారు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు యశోదా హాస్పిటల్స్ వారి సౌజన్యంతో కోవాక్సిన్ టీకా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్లో స్థానికులతో సహా హుజుర్నగర్ మొదలగు చుట్టు ప్రక్కల గ్రామవాసులు సుమారు 300 మందికి కోవాక్సిన్ టీకా మొదటి డోసు వేయడం జరిగింది. స్థానిక శాసన సభ్యుడు శ్రీ బొల్లం మల్లయ్య గారు ఈ కార్యక్రమమును ప్రారంభించగా స్థానిక వైశ్య ప్రముఖులు, అవోపా కోదాడ అధ్యక్షుడు శ్రీ చెన్నకేశవరావు, కార్యదర్శి శ్రీ వెంపటి రంగారావు అవోపా సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టు గా కోదాడ ను ఎంచుకున్నందుకు దానిని విజయవంత మొనర్చిన అవోపా కోదాడ అధ్యక్ష కార్యదర్శు లను తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నది.
కోదాడ వాక్సినేషన్ క్యాంపు వీడియో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి