అవోపా మిర్యాలగూడ వారిచే కోవిడ్ వాక్సినేషన్ కాంప్ నిర్వహణ

 

తేదీ 9.6.2021 రోజున అవోపా మిర్యాలగూడ వారు స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం లో కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ ను తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు యశోదా హాస్పిటల్స్ మాలక్ పేట వారి సహకారం తో  ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 500 మంది కోవాక్సిన్ టీకా ను వేయించుకోవడం జరిగినదని తెలియ బరచారు. ఈ కార్యక్రమములో అవోపా మిర్యాలగూడ అధ్యక్షుడు శ్రీ ఏచూరి మురహరి, కార్యదర్శి  జి. జనార్దన్, ఏచూరి శ్రీనివాస్, వ్యాపార దిగ్గజం రంగా శ్రీహరి, చింతా శ్రీనివాస్, రైస్ మిల్లర్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ కర్నాటి రమేష్, యశోదా మలక్ పేట డాక్టర్ సురేంద్రబాబు, జ్యోతి వారి బృందం పాల్గొని ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకు టీకా కార్యక్రమం నిర్వహించారు. టీకా కార్యక్రమము విజయవంతం గా నిర్వహించి నందులకు అవోపా అధ్యక్షుడు ఏచూరి మురళి గారిని, కార్యదర్శి జనార్ధన్ గారిని యశోదా మలక్ పేట వైద్య బృందాన్ని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి. మిగతా కార్యక్రమ వివరాలు ఈ క్రింది వీడియోలో చూడగలరు.
కామెంట్‌లు