నేటి దినసరి రాశి ఫలాలు

 


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 
*_శుభమస్తు_* 👌 
*_02, మార్చి , 2021_*                 *_భౌమ వాసరే_*
*_రాశి ఫలాలు_* 
 
🐐 *_మేషం_*
ఈరోజు
మంచి పనులు చేపడతారు.గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. *_ఆంజనేయారాధన శుభప్రదం_* . 
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 *_వృషభం_* 
ఈరోజు 
మీ మనోధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక వ్యవహారంలో అధికారుల మన్ననలను అందుకుంటారు. ప్రయాణ సౌఖ్యం కలదు.  *_సాయి ఆరాధనా చేస్తే మంచిది_* . 
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 *_మిధునం_*
ఈరోజు
ఆత్మవిశ్వాసంతో పనిచేయండి అనుకున్నది దక్కుతుంది. చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది. అపార్థాలకు తావులేకుండా వ్యవహరించాలి.  *_సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రము పఠిస్తే బాగుంటుంది._* 
💑💑💑💑💑💑💑

🦀 *_కర్కాటకం_*
ఈరోజు
పెద్దల ఆశీర్వచనాలతో ఒక పనిలో ఆశించిన ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలు పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. *_సాయిబాబా సందర్శనం శుభప్రదం._* 
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 *_సింహం_*
ఈరోజు
శుభసమయం. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి.  *_శివ నామస్మరణ ఉత్తమం_* . 
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 *_కన్య_*
ఈరోజు 
మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధనధాన్య లాభాలుంటాయి. ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు. తోటివారి సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు.  ఎట్టి పరిస్థితిల్లోనూ మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. *_లక్ష్మీ నామాన్ని జపించడం ఉత్తమం._*  
💃💃💃💃💃💃💃

⚖ *_తుల_*
ఈరోజు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. *_వేంకటేశ్వర స్వామిని  ఆరాధించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు_* . 
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 *_వృశ్చికం_*
ఈరోజు 
మీ ఓర్పుకు ఇది పరీక్షా కాలం. మీ మీ రంగాల్లో.. ఆచితూచి ముందుకు సాగాలి. ఆలోచించి మాట్లాడాలి. లేదంటే అపకీర్తిని మూట కట్టుకుంటారు.   ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. *_శ్రీ రామరక్షా స్తోత్రం చదివితే మంచి జరుగును._* 
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 *_ధనుస్సు_*
ఈరోజు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. నీరసించకుండా పనిచేస్తే గొప్ప ఫలితాలు సాధిస్తారు. శతృవులపై నైతిక విజయం సాధిస్తారు. ముఖ్య విషయాల్లో  అజాగ్రత్తగా ఉంటే వివాదాలు చుట్టుముడతాయి. చెడు సావాసాల వల్ల మనోవిచారం కలుగుతుంది. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. *_శనికి తైలాభిషేకం శుభప్రదం._*    
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 *_మకరం_*
ఈరోజు
చిత్తశుద్ధితో పనిచేసి కార్యములందు విజయం సాధిస్తారు. ఒకవార్త మీ మనస్సుకు ఇబ్బందిని కలిగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విఘ్నాల్ని కలిగించేవారు పక్కనే ఉంటారు. *_ఆదిత్య హృదయం చదివితే మంచిది._*     
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 *_కుంభం_*
ఈరోజు
సకాలంలో పనులు పూర్తవుతాయి. దైవానుగ్రహంతో శుభం జరుగుతుంది. భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో పురోగతి ఉంటుంది. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. స్వస్థాన ప్రాప్తి ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_ఈశ్వర సందర్శనం శుభప్రదం._*
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 *_మీనం_*
ఈరోజు
మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది. బుద్ధిబలంతో సమస్యలు తొలుగుతాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యలతో ఆనందాన్ని పంచుకుంటారు. *_విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మేలు._*  
🦈🦈🦈🦈🦈🦈🦈
                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 
                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు