టౌన్ అవోపా వనపర్తి వారి ఆధ్వర్యంలో నేడు 3.1. 2021 ఆదివారం రోజున గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన ఆన్లైన్ భగవద్గీత పోటీలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ మలిపెద్ది శంకర్ గారి ప్రారంభం ఉపన్యాసంతో మొదలైనవి. వారు మాట్లాడుతూ భగవద్గీత మన నిత్య జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశం గారు మాట్లాడుతూ విద్యార్థులకు మంచి విలువలు పెంపొందించే ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీ కొండూరు రాజయ్య గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఎంతో మందికి స్పూర్తి దాయకమని తెలుపడంతో పాటు ఉన్నత విభాగంలోని ప్రథమ బహుమతి విజేత కు తాను స్వయంగా రూ.1000లు గూగుల్ పే ద్వారా అందించారు. ఈ కార్యక్రమానికి ప్రభావితమై శ్రీ చిగుళ్లపల్లి రమేష్ గారు 16 భగవద్గీత పుస్తకాలను విజేతలకు అందించారు. న్యాయనిర్ణేతలుగా శ్రీ పాండురంగయ్య శ్రీ సుధాకర్ వ్యవహరించారు. యుపిఎస్ విభాగాల్లో విజేతలుగా సిహెచ్ శ్రీకరి - హైదరాబాద్, టి యశ్వంత్ - ఆత్మకూర్, ఆర్ ప్రదీప్ గౌడ్ - కొల్లాపూర్, డి విశ్వ విఖ్యాత్ - వనపర్తి గెలుపొందగా, హైస్కూల్ విభాగంలో ఎస్.చిన్మయి -వనపర్తి, ఇందుప్రియ - రాయచూర్,బాదం వైష్ణవి - హైదరాబాద్, వి. రక్షిత - హైదరాబాద్ లు విజేతలుగా నిలిచారు. వీరికి అందరికీ కలిపి 18 వేల రూపాయల నగదు బహుమతులు "ఫోన్ పే'' ద్వారా పంపడం జరిగింది. వనపర్తి జిల్లా అధ్యక్షుడు జి.మహేష్, అవోపా వనపర్తి టౌన్ కార్యదర్శి లగిశెట్టి శ్రీనివాసులు , ఆకు తోట శ్రీధర్, గౌరవ సలహాదారు సంబు వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు ప్రసాద్, నరేందర్, ప్రకాష్, రమణ, శివ, రవి కుమార్ సురేష్ బాబు, వెంకటయ్య, భాస్కర్, రాఘవేందర్లు పాల్గొన్నారని లగిశెట్టి శ్రీనివాసులు కార్యదర్శి గారు తెలియజేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి