నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_22, డిసెంబర్ , 2020_* *_భౌమ వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

అర్థలాభం ఉంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. కుటుంబ చిక్కులు ఇబ్బంది పెడతాయి. ఋణ సమస్యలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. 

*_శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_*

ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఎవ్వరితోనూ విభేదించకండి. మాటవిలువను కాపాడుకోవాలి. ఎప్పటినుండో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 

*_శ్రీ రామ నామస్మరణ మేలు చేస్తుంది._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

ముఖ్యవిషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండటం మంచిది. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 

*_గణపతి సందర్శనం శుభప్రదం._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

 ఒక వ్యవహారంలో మీకు కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. *_రాహు శ్లోకాన్ని చదువుకోవడం మంచిది._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

 మొదలుపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 

*_ఆంజనేయ స్వామిని ఆరాధించాలి._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

 శుభకాలం. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. *_శని శ్లోకాన్ని చదివితే మంచిది._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

చేప్పట్టే పనుల్లో సంతృప్తికర ఫలితాలను సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. *_విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. *_లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

మీలోని పోరాట పటిమ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. అధికారులు మీపట్ల మిశ్రమ వైఖరితో ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. 

*_శ్రీ వేంకటేశ్వర సందర్శనం శుభప్రదం._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలుంటాయి. 

*_శ్రీ రామ సందర్శనం ఉత్తమం._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

 వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన సమయం. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహకారంతో ఒక ముఖ్య వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. *_శ్రీ రామ నామాన్ని జపించాలి._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు