నేటి వారఫలాలు


Astrologer & Numerologist


వారఫలాలు
-----------------------------------------------
06th DEC 2020 నుండి 12th DEC 2020 వరకు
 గమనిక:* ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టిలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. 


* మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనుభవంలోకి వస్తాయి. 



మేషరాశి (Aries)
----------------------------------
అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం నూతనోత్సాహంతో కొన్ని పనులు చేపడతారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో కొత్త మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల ప్రయత్నాలు సఫలం.  ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.



వృషభరాశి ( Taurus) 
------------------------------------
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. దీర్ఖకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు. ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి, కాంట్రాక్టులు దక్కుతాయి. ధనవ్యయం, బంధువులతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. 



మిధునరాశి ( Gemini)
---------------------------------------
మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు.


కర్కాటకరాశి ( Cancer) 
---------------------------------------------
పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా గడుస్తుంది. అనారోగ్య సూచనలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు స్థిరమైన ఉద్యోగయోగం కలుగవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి.


సింహరాశి (Leo) 
----------------------------------
మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం ఉద్యోగాలలో సమస్యలు తీరి ఒడ్డునపడతారు. పారిశ్రామికవర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం.  ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.  కొత్త మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. మీ ఊహలు నిజం కాగల సూచనలు. వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలమైన పరిస్థితి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


కన్యారాశి ( Virgo)
--------------------------------
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం రాజకీయవర్గాలకు ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.


తులారాశి ( Libra) 
---------------------------------
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. కళారంగం వారికి కలలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు, రుణభారాలు కొంత తగ్గవచ్చు. ఆర్థిక పరిస్థితి క్రమేపీ పుంజుకుంటుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల శ్రమ కొలిక్కి వస్తుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీపై వచ్చిన అపవాదులు తొలగి ఊరట చెందుతారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి.


వృశ్చికరాశి ( Scorpio) 
------------------------------------
విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. విద్యార్థులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలమవుతాయి. ఎంతటి వ్యవహారమైనా విజయం సాధిస్తారు. పట్టుదల, ధైర్యంతో అడుగేసి సమస్యల నుంచి బయటపడతారు. మీలోని శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులను ఆకట్టుకుంటాయి. 


ధనుస్సురాశి ( Sagittarius)
--------------------------------------------
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం వ్యాపారాల విస్తరణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. కొన్ని వివాదాలు, సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.  విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. మీ ఆశయాలు కొన్ని నెరవేరతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది.


మకరరాశి ( Capricorn)
---------------------------------------
ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 
ఈ వారం ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. కొన్ని వ్యవహారాలు నిదానంగా కొనసాగుతాయి. ఆప్తుల నుంచి సలహాలు పొంది తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహాన్నిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. 


కుంభరాశి ( Aquarius)
------------------------------------
ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొంత పరిష్కారమవుతాయి. చేపట్టిన వ్యవహారాలు ఉత్సాహవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు.  శుభకార్యాలు నిర్వహిస్తారు. యుక్తితో కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు.


మీనరాశి ( Pisces)
---------------------------
పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయటా వ్యతిరేకత ఉంటుంది. ఆస్తుల విషయంలో సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. బంధువర్గంతో విభేదాలు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కాంట్రాక్టులు చేజారి నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.


 మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ దుర్గా అష్టోత్తరం చేయండి


                                                       @@@


Sri Dr. Kumar has been Selected for Online Astro Consultant for Astroswamig ..and Astroyogi..The profile visible now in Astroswamig..and soon will be visible in Astroyogi. Those interrested may contact him for your Astrological predictions.




కామెంట్‌లు