అభినందనలు


నాగర్ కర్నూల్ టౌన్ అవోపా అధ్యక్షుని ఎన్నిక స్థానిక కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఈరోజు జరిగినది. ఈ  కార్యక్రమంలో నాగర్ కర్నూల్ టౌన్ అవోపా నూతన అధ్యక్షుడిగా శ్రీవాస రాఘవేందర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారులుగా బిల్ల కంటి రవి కుమార్ జిల్లా అధ్యక్షులు, పోల శ్రీధర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఇమ్మడి దేవేందర్ ఆర్థిక కార్యదర్శి వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గా ఇందువాసి రవి ప్రకాష్ ఆర్థిక కార్యదర్శిగా శ్రీకాంత్ పి ఆర్ ఓ గా వెంకట రాజులను నామినేట్ చేయడం జరిగిందిి. వీరి పదవీకాలం 2021- 22 వరకు ఉంటుందని వీరు నాగర్ కర్నూలు జిల్లా అవోపా సూచనలు పాటిస్తూ,అన్ని ప్రోగ్రాములలో ప్రథమ స్థానంలో నిలవాలని జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని జిల్లా అధ్యక్షుడు బిల్ల కంటి రవి కుమార్ కోరారు. ఈ నెలలో జరిగే వివాహ పరిచయ వేదిక విజయవంతం చేయడంలో నూతన అధ్యక్షులు వారి కార్యవర్గం కృషి చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు మరియు రాష్ట్ర ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నూతనముగా ఎన్నికైన అధ్యక్షుడు శ్రీ వాసా రాఘవేందర్ గారిని ప్రధాన కార్యదర్శి శ్రీ ఇందువాసి రవి ప్రకాష్ గారిని, ఆర్థిక కార్యదర్శి శ్రీ కాంత్ గారిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తూ, బైలా ప్రకారం నడుచు కోవాలని, కొత్త సభ్యులను చేర్చు కోవాలని తోటి వైశ్య సంఘాలతో మమేకమై అన్ని అవోపా కార్య క్రమాలు చేయాలని ఉద్బోధించు చున్నవి. 


కామెంట్‌లు