హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఉప్పాల శ్రీనివాస్ గుప్తా తేది 20.11.2020 రోజున పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి నిరంతరాయంగా కృషి చేస్తామనీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యాటక అభివృద్ధి దశల వారీగా చేస్తామనీ, గ్రామాల్లో మినీ ట్యాంక్ బండ్లను నిర్మించడమే కాకుండా యాదాద్రి, కాలేశ్వరం మరియు వేములవాడ వద్ద ఆలయ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. వీరు భవిష్యత్తులో రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదగాలని, మరెంతొ మందికి సేవ చేయాలని అభిలశిస్తూ తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బుల్లెటిన్ మనస్పూర్తిగా అభినందన శుభాకాంక్షలు తెలియజేయుచున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి