నూతన అధ్యక్షుని కి అభినందనలు, శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్తీకారణ లో భాగంగా మహబూబ్నగర్ నుండి నారాయణపెట్ వేరు చేసి జిల్లాగా ప్రకటించి నందున తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షులు శ్రీ మలిపెద్ది శంకర్, పొలా శ్రీధర్, కలకొండ సూర్యనారాయణ మరియు కార్యదర్శి కోడూరు రాజయ్య గారలు యూనిట్ అవోపాల కమిటీల పునరుద్ధరణ, పునర్వవస్తీకారణ లో భాగంగా అవోపాల బైలాలనుసారం మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్యబాబు ఆదేశాల మేరకు ఎన్నికల కమిటీ గా ఏర్పడి నారాయణపెట్ అవోపా కు ఎన్నికలు జరిపించి శ్రీ యాదయ్య శెట్టి ఎమ్.ఎస్.సి, ఎమ్.ఇ.డి గారిని నూతన అధ్యక్షుడిగా ఎన్నిక చేసి నందున ఎన్నికల కమిటీ కి మరియు నూతనముగా ఎన్నికైన శ్రీ యాదయ్య శెట్టి గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలియ జేయుచూ, త్వరలో కార్య వర్గాన్ని ఏర్పరచు కోవలసినది గా నూతన అధ్యక్షుడి ని కోర నైనది.   వీరి గురించి క్లుప్తంగా :  వీరు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ నారాయణపేట జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో డిప్యూటేశన్ మీద పనిచేయు చున్నారు. ఇదివరలో వీరు నారాయణ పెట్ వైశ్య సంఘానికి అధ్యక్షుడిగా మరియు కార్యదర్శి గా కూడా పని చేశారు. ప్రస్తుతం నారాయణపేట టౌన్ బాడి లో ఉపాధ్యక్షులు గా పని చేయు చున్నారు. చాలా మంది విద్యార్థులకు, ఇతరులకు విద్యా సంబంధిత మరియు ప్రాయోజిత కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. వీరు ఒక స్కూల్ మరియు జూనియర్ కాలేజీ నడుపు చున్నారు. అందులో కొంత మంది బీద వైశ్య విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. వీరు వాసవి క్లబ్, వనిత క్లబ్, మరియు ఆర్యవైశ్య యువజన సంఘం నిర్వహించు పలు ప్రాయోజిత కార్యక్రమాల్లో పాలు పంచు కున్నారు. అలాగే అవోపా కు కూడా సముచిత రీతిలో సేవలు అందిస్తారని ఆశించుదాము. 


యాదయ్య శెట్టి ఫోన్ నెంబర్ : 9885760740


కామెంట్‌లు