ఈ వారం రాశి ఫలితాలు


వారఫలాలు


29th Nov 2020 నుండి 05th Dec 2020 వరకు


గమనిక:


ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి లను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు తెలియజేస్తున్నాము. 


 


సంపూర్ణ ఫలితాలు మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి.మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. 


 


 


మేషరాశి (Aries) 


------------------------


అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి


ఈ వారం కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ప్రతికూలతలు తొలగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సన్నిహితుల సలహా పాటిస్తారు. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సోమ, మంగళ వారాల్లో ఒత్తిడి శ్రమ అధికం. గృహంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


 


వృషభరాశి ( Taurus) 


------------------------------


కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి


ఈ వారం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. మార్కెట్ రంగాల వారిక ఒత్తిడి అధికం. అన్ని రంగాల వారికి శుభదాయకమే. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు బలపడుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుది. సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.


 


 


మిధునరాశి ( Gemini) 


-------------------------------


మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి


ఈ వారం మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. సంతానం విషయాల్లో శుభఫలితాలున్నాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం వాయిదా పడుతుంది. బంధుమిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు.


 


కర్కాటకరాశి ( Cancer) 


--------------------------------


పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి


ఈ వారం వ్యాపారాల్లో ఆటంకాలు దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యవహారానూలత ఉంది. అంచనాలు ఫలిస్తాయి. కలిసి వచ్చిన అవకాశాలు వదులుకోవద్దు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. శని, ఆది వారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. దంపతల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన తొలగి కుదుటపడుతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పాత పరిచయస్తులు తారసపడుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


 


సింహరాశి (Leo) 


----------------------


మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి


ఈ వారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. విద్యా సంస్థలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. దళారులు ఏజెన్సీలను నమ్మవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మంగళ, బుధ వారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. గృహ మరమ్మతులు చేపడుతారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


 


కన్యారాశి ( Virgo) 


-------------------------


ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి


ఈ వారం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. సంతానం చదువులపై శ్రద్ద అవసరం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, ప్రోత్సాహక బహుమతులు అందుకుంటారు. వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. బెట్టింగులు, జూదాలకు పాల్పడవద్దు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.


 


తులారాశి ( Libra) 


-------------------------


చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి


ఈ వారం అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అవకాశాలు కలిసివస్తాయి. మానసికంగా కుదుటపడుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. గృహ మరమ్మతులు చేపడుతారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి నెలకొంటుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు కొత్త బాధ్యతలు, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. దైవ కార్యంలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి.


 


వృశ్చికరాశి ( Scorpio) 


-------------------------------


విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి


ఈ వారం అప్రమత్తంగా ఉండాలి. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. పట్టుదలతో వ్యవహరించండి , మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు ప్రోత్సాకరంగా సాగుతాయి. కాంట్రాక్టులు చేజారిపోతాయి. ఏజెంట్లు, రిప్రెజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం. 


 


ధనుస్సురాశి ( Sagittarius)


--------------------------------------


మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి


ఈ వారం వ్యవహారానుకూలత అంతంతమాత్రమే. ఆశావహ దృక్పథంతో మెలగండి. త్వరలో శుభవార్తలు వింటారు. అవసరాలకు ధనం అందుతుంది. ఆది, సోమ వారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల కష్టం ఫలిస్తుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. 


 


మకరరాశి ( Capricorn) 


--------------------------------


ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి


ఈ వారం ఆదాయ వ్యయాలు సతృప్తికరం. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మగళ, బుధ వారాల్లో ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయుల సలహా పాటించండి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానం ద్వారా శుభవార్తలు వంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. చేతివృత్తులు, కార్మికులకు సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. మార్కెట్ రంగాల వారికి సామాన్యం. షేర్ల క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 27 ప్రదక్షిణలు చేయండి, 


 


కుంభరాశి ( Aquarius) 


--------------------------------


ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి


ఈ వారం ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.పనివారల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. వ్యాపారాల ఊపందుకుంటాయి.కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథకాలు మునుముందుకు సత్ఫలితాలిస్తాయి. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. గురు, శుక్ర వారాల్లో ఖర్చులు విపరీతం. సంప్రదింపులతో తీరిక ఉండదు. కాంట్రాక్టులు ఏజెన్సీలను దక్కింటుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


 


మీనరాశి ( Pisces) 


-------------------------


పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి


నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో రాణింపు. ప్రతికూలతలు అధికం. చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. ఆత్మీయుల హితవు మీపై సత్ర్పభావం చూపుతుంది. ఖర్చులు సామాన్యం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.


మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ దుర్గా అష్టోత్తరం చేయండి


కామెంట్‌లు