గాంధీ జయంతి నిర్వాహణ


ఈ రోజు మహాత్మా గాంధీ 151వ జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు అవోపా కామారెడ్డి వారు స్థానిక జిల్లాపరిషత్ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించ‌డం జ‌రిగింది. మహాత్మా గాంధీ ఆశయాలలో ముఖ్యమైన సత్యం, అహింసా మార్గాలలో అందరం పయనించి సమాజంలోని హింసను పారద్రోలి శాంతియుతంగా, ఆధ్యాత్మిక మార్గంలో తమ తమ జీవితాలను గడపాలని, గాంధీజీ ఆశయాలలో ప్రయాణం సాగిస్తే ఒత్తిడిని అధిగమించవచ్చు అని కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు వుపులపు సంతోష్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తృప్తి శ్రీనివాస్, ఆర్థిక కార్యదర్శి బెజుగం గంగప్రసాద్ మరియు సభ్యులు సుబ్బారావు, మురళి, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. గాంధీ జయంతిని పురస్కరించుకొని sanitisers వితరణ చెయ్యడం జరిగింది.


కామెంట్‌లు