ఈ వారం రాశి ఫలితాలు


వారఫలాలు


25 oct 2020 నుండి 31st oct 2020 వరకు


మేష రాశి


అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- 


ఈ వారం వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు. పారిశ్రామిక వర్గాలకు శ్రమకు తగిన ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా అవసరాలకు ఇబ్బంది ఉండదు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. 


 


 


వృషభ రాశి


కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి :- 


ఈ వారం వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. ఖర్చులు అదుపులోకి వస్తాయి. శుభవార్తలు వింటారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయటా ఒత్తిడులు. వ్యవహారంలో, కుటుంబంలో శ్రమాధిక్యం.


 


 


మిథున రాశి


మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-


ఈ వారం వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. కళారంగం వారికి నిరీక్షణ ఫలిస్తుంది. సమాజసేవలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. విద్యార్థుల ప్రయత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యభంగం.


 


కర్కాటక రాశి


పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 


ఈ వారం మీ ఊహలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు, వివాదాలు సర్దుమణుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు. ముఖ్య పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. 


 


సింహరాశి


మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగాయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు అనూహ్యమైన పిలుపు అందవచ్చు. శుభకార్యాలపై ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. 


 


కన్యారాశి


ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 


ఈ వారం ఇంటి నిర్మాణాల్లో కొన్ని అవరోధాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులతో అకారణంగా విభేదాలు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు. వాహనయోగం. ఉద్యోగలాభం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి,


 


తులా రాశి:


చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 


ఈ వారం ఆర్థికంగా బలం చేకూరి అవసరాలు తీరతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆప్తులు, బంధువుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి. 


 


వృశ్చికరాశి


విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 


ఈ వారం కొన్ని సమస్యలు, వివాదాలు అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు. కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యసమస్యలు. 


 


ధనుస్సురాశి


మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- 


ఈ వారం ముఖ్య పనులు విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో తగినంత గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు కొన్ని దక్కే సూచనలు. చేపట్టిన పనులలో అనవసర జాప్యం. విద్యార్థులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. 


 


మకరరాశి


ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 


ఈ వారం చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలలో అనుకోని విధంగా లాభాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు. సమాజసేవలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. వాహనయోగం. వివాదాల నుంచి బయటపడతారు. సోదరులతో సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.


 


కుంభరాశి


ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాముల నుంచి కొత్త పెట్టుబడులు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. కొత్త పనులు చేపడతారు. అనుకోని ధనవ్యయం. స్వల్ప ఆరోగ్య సమస్యలు.


 


మీన రాశి


పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- 


ఈ వారం వాహనసౌఖ్యం. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగి రుణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. కుటుంబసమస్యలు క్రమేపీ తీరతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ధననష్టం. బంధువిరోధాలు, అనారోగ్యం.


గమనిక : 


ఈ వారం మంచి ఫలితాల కోసం అందరూ గణేశ మరియు దుర్గకు అర్చన చేయాలి



MANASA JYOTISHALAYAM


-------------------------------------------


Dr. Kumar, PhD


Astrologer & Numerologist


 


Email : glowskin15@gmail.com


 


CONSULTANT ASTROLOGER


Suman TV


( Divine Destiny Associates India Pvt Ltd ; Hyderabad )


 


WEEKLY VAARA PHALALU


------------------------------------------


AVOPA News Bulletin


Every Sunday


 


TELANGANA STATE PRESIDENT


--------------------------------------------------


Kalinga International Astrologers Society


(A Unit of IVARC, Bhubaneswar)


 


HONOUR'S & GOLD MEDALS


--------------------------------------------


Maharshi Jaimini Gold Medal Award


Nakshatra(Indian Deligate)Award


Kalinga Ratna Award - Gold Medal


LifeTime Achievement Award


Kalinga Neela Ratna Award - Gold Medal


Jyotish Ratna 


 


TITLES BESTOWED


-------------------------------


Jyotish Surya


Jyotish Sastry


Saraswathi Putra Jyotish Ratna Samman


Bhrugu Smarak Samman


Indian Astrologers Samman(IAS)


 


SERVICES OFFERED


--------------------------------


Horoscope ForeCasting(Brief)


Marriage Compatibility


Muhurthas - For All Occasions


Names Advise As Per Biirth Details


Vasthu Consultation


 


Consultation By Appointment Only


Consultation Fee. : 1,500/- 


Consultation Time. : 45 Minutes


కామెంట్‌లు