ఈ వారం రాశి ఫలితాలు 11.10.2020 నుండి 17. 10.2020 వరకు
......
మేష రాశి
ఈ వారం ఉద్యోగాలలో వేధిస్తున్న సమస్యలు తీరతాయి. పనులలో ఆటంకాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో కదలికలు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి, పెట్టుబడులు సమకూరతాయి. వారం చివరిలో అనారోగ్య సూచనలు.
వృషభ రాశి
ఈ వారం వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు, అన్నింటా సహనం ముఖ్యమని గమనించండి. స్వల్ప అనారోగ్య సూచనలు . ముఖ్యమైన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మరింత అనుకూలత ఉంటుంది. కొన్ని ఆశ్చర్యకమైన విషయాలు తెలుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
మిథున రాశి
ఈ వారం ఇంటా బయటా సమస్యలు అధిగమిస్తారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గే అవకాశం. కళారంగం వారికి కొన్ని అవకాశాలు దక్కుతాయి. ఆత్మస్తైర్యాన్ని విడవద్దు. అధిక ఆలోచల వలన ఆరోగ్యభంగం. ఆహార నియమాలు పాటించండి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఊహించని ఆహ్వానాలు అందుతాయి.
కర్కాటక రాశి
ఈ వారం ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో సమస్యలు, అనారోగ్యం సూచనలు, ప్రత్యక శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. పలుకుపడి పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.
సింహరాశి
ఈ వారం ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు కొంత మేర ఫలిస్తాయి. బంధుమిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆర్థిక విషయాలు కొంత సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
కన్యారాశి
ఈ వారం ఉద్యోగాలలో ఒత్తిడులు తగ్గుతాయి. రాజకీయవర్గాలకు కొన్ని అంచనాలు నిజం కాగలవు. సోదరులతో మాటపట్టింపులు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. వివాహ, ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. అత్యంత నేర్పుగా కొన్ని సమస్యలు అధిగమిస్తారు.
తులా రాశి:
ఈ వారం ఉద్యోగాలలో పైస్థాయి వారితో వివాదాలు సర్దుబాటు కాగలవు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆశించినంత లాభాలు అందుతాయి.
వృశ్చికరాశి
ఈ వారం ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. పారిశ్రామికరంగం వారికి సమస్యల నుంచి విముక్తి. ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగుతాయి. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కోర్టు వ్యవహారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనుస్సురాశి
ఈ వారం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలసివచ్చే సమయం. మీ నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు, వివాదాలు తీరతాయి. కళారంగం వారికి అవకాశాలు కొన్ని దక్కవచ్చు. సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. ఆశించిన రీతిలో డబ్బు అందుతుంది. ఊహించని ఆహ్వానాలు రాగలవు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు.
మకరరాశి
ఈ వారం ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సమాజ సేవలకు గుర్తింపు రాగలదు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనయోగం. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి.
కుంభరాశి
ఈ వారం సంఘంలో మరింత పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. రుణప్రయత్నాలు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలపై చర్చలు కొనసాగిస్తారు. స్థిరాస్తుల వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులు కార్యసాధకులవుతారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది.
మీన రాశి
ఈ వారం ఉద్యోగాలలో మార్పులు తథ్యం. వాహన యోగం. స్థిరాస్తివృద్ధి. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
గమనిక :
ఈ వారం మంచి ఫలితాల కోసం అందరూ గణేశ మరియు దుర్గకు అర్చన చేయాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి