నేడు మన అవోప నాగర్ కర్నూల్ అధ్యక్షుడు శ్రీ ఫణి కుమార్ అధ్యక్షతన స్థానిక శ్రీ సీతారామ స్వామి ఆలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో గత రెండు సంవత్సరాల కాలంలో పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులు బొడ్డు వేణు, రాచూరి వెంకట రాజు కొండూరు సాయిబాబు, సోమిశెట్టి నిరేష్ బాబు, పోల శ్రీనివాసులు గార్లను సన్మానించడం జరిగింది. మరియు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన శ్రీ కందూరి బాలరాజు గారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అవోపా రాష్ట్ర బాధ్యులు శ్రీ వాస పాండురంగయ్య గారు, దర్శి రాజయ్య, కార్యదర్శులు సాయి శంకర్ రవి ప్రకాష్ తదితరులు పాల్గొని విజయవంతం చేసినారు. సహకరించిన సభ్యులందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
ఉపాధ్యాయులకు సన్మానాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి