నాగర్ కర్నూల్ జిల్లా అవోపా ఎన్నికలు తేది 19.4.2020 రోజున నిర్వహించగా శ్రీ బిళ్లకంటి రవి కుమార్ గారు అధ్యక్షుడు గా ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. వారు తమ కార్యవర్గ కమిటీని ఏర్పరచి తేది 20.9.2020 రోజున ఆదివారం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జూమ్ అనువర్తనం ద్వారా నిర్వహించారు. పూర్వ ఆంధ్రప్రదేశ్ అవోపా అధ్యక్షుడు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్ గారు శ్రీ బిళ్లకంటి రవికుమార్ గారిచే అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర అవోపా ప్రధాన కార్యదర్శి శ్రీ నిజామ్ వెంకటేశం శ్రీ కందికొండ శ్రీనివాసులు గారిచే కార్యదర్శిగా, ఆర్థిక కార్యదర్శి శ్రీ చింతా బాలయ్య గారు శ్రీ ఇమ్మడి దేవేందర్ గారిచేత కోశాధికారిగా ప్రమాణ శ్రీ కారం చేపించగా ఉపాధ్యక్షులు శ్రీ మలిపెద్ది శంకర్, కలకొండా సూర్య నారాయణ, కార్యదర్శి కొండూరు రాజయ్య, అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి, పోలా నర్సింహయ్య, వాసా పాండు రంగయ్య తదితరులు మిగతా కార్యవర్గ సభ్యులచే ప్రమాణ శ్రీ కారం చేయించారు. కార్యక్రమం వాసవి మాత ప్రార్థనా గీతం తొ మొదలై తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షులు పూర్వ నాగర్ కర్నూల్ జిల్లా అవోపా అధ్యక్షుడు శ్రీ పోలా శ్రీథర్ గారి అధ్యక్షతన మరియు కందికొండ శ్రీనివాస్ సాంకేతిక సహకారం తొ కార్యక్రమం సజావుగా సాగింది. ప్రమాణ శ్రీ కారం చేసిన అధ్యక్షుడు శ్రీ బిల్లకంటి రవికుమార్ గారు మాట్లాడుతూ ఆవోపా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా విస్తృతం చేస్తామని విద్యపరంగా, వైద్యపరంగా, సేవా పరంగా కార్యక్రమాలను అందరిని భాగస్వామ్యం తొ చేపడు తామని తమ 2 సంవత్సరాల పదవి కాలంలో అవోపాకు మంచి గుర్తింపు తీసుకువస్తామని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో అవోపా సంఘం అభివృదికి, విస్తరణకు కృషి చేస్తానని అవోపా లక్ష్యాలకు అనుగుణంగా సంఘాన్ని ముందుకు తీసుకు వెళ్తానని సభ్యులను, సలహాదారులను ప్రధాన నాయకులను - సమన్వ యం చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మిగతా కార్యవర్గ సభ్యుల్లో ఉపాద్యక్షులుగా పాండు శ్రీనివాస్, రాజకీయ, ఉప కార్యదర్శి సాయి శంకర్, కృష్ణయ్య, శ్రీనివాసులు కార్యనిర్వాహక కార్యదర్శిగా విజయకుమార్, కిషోర్ వెంకటేష్ మహిళా కార్యదర్శులుగా సీతా, జానకి, జ్యోతి, వనజ వైద్య విభాగం బాధ్యులుగా డాక్టర్ రోహిత్, డాక్టర్ భాస్కర్, నారాయణ సేవ కమిటీ ఇంచార్నీగా హాకీం విశ్వప్రసాద్ న్యాయ సలహాదారులుగా శివ, శ్రీనివాసు ప్రమాణ స్వీకారం చేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి