అభినందనలు


ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించబడు NEET  లో ద్వితీయ స్థానం పొందిన  డా.కొత్త సౌమ్య గారిని  తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి. డా.సౌమ్య మాజీ మండల విద్యాధికారి మరియు పాపన్నపేట మండల ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ కొత్త లక్ష్మయ్య గుప్త-శ్రీమతి సూర్యకళ గార్ల కుమార్తె. వీరి స్వస్థలం కొత్త లింగాయపల్లి, పాపన్నపేట మండలం మెదక్ జిల్లా. ఈవిడ విద్యాభ్యాసం 1నుండి 10 తరగతి వరకు ZPHS లింగాయపల్లి లో, ఇంటర్ శ్రీ చైతన్య హైదరాబాద్ లో మరియు MBBS గాంధీ మెడికల్ కాలేజ్, హైదరాబాద్ లో జరిగినది. ప్రస్తుతము MD గా   (సూపర్ స్పెషాలిటీ, రుమాటలజీ లో ) పనిచేయు చున్నారు. అఖిల భారత స్థాయిలో అనన్య సామాన్యమైన రెండవ స్థానంలో నిలిచి పలువురిని ఆశ్చర్య చకితులను చేసిన ఈ డాక్టర్ గారు నిజంగా అభినందనీయురాలే. 


 


 


కామెంట్‌లు