అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో లాక‌్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర‌్యవైశ‌్య ముద‌్దు బిడ్డ, వరంగల్ మహానగర ప‌్రధమ పౌరుడు (మేయర్ ) శ‌్రీ గుండా ప‌్రకాశ్ రావు గారిచే ప‌్రారంబించబడి నేటికి 50 రోజులు గడచినవి. తేది 5జూన్ 2020 రోజున పాల ఓంప‌్రకాష్ - వాణి ల కుమారుడు- కోడలు సందీప్ - తేజస‌్విని మనవడు "అవ‌్యుక‌్త్ ప‌్రకాష్" మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో ఈరోజు కార‌్యక‌్రమం నిర‌్వహించడం జరిగింది. ఈరోజు కార‌్యక‌్రమం మన ఆర‌్యవైశ‌్యముద‌్దుబిడ‌్డ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ‌్రీ కోలేటి దామోదర్ గారి పుట్టిన రోజు సందర్భంగా వారికి అంకితం. ఈ కార‌్యక‌్రమం లో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప‌్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప‌్రకాశం, వ‌్యవస‌్థాపకులు శ‌్రీ పోకల చందర్ గారు, మరియు అలుగూరి శివకుమార్, అనంతుల కుమారస్వామి, తాటికొండ సుధాకర్, దోమకుంట‌్ల సంజీవయ‌్య, గుంటూరు వెంకటనారాయణ, దేవా మధుబాబు, అయితా భాస‌్కర్ రావు, అకినపెల‌్లి సత‌్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 250 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార‌్యక‌్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు ఆ " వాసవీ" మాత కరుణా కటాక్షాలు, మరియు ఆయురారోగ్యాలు ప‌్రసాదించాలని అధ్యక్షుడు మరియు కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు.
అవోపా హన‌్మకొండ వారి ఆహార పంపిణి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి