తేదీ 2.10.2019 రోజున మహాత్మాగాంధీ 150 వ జన్మదిన సందర్భంగా అవోప హుజురాబాద్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను పాటించి అయన చూపిన సత్యం అహింస మార్గాలలో నడుచుకోవాలని అధ్యక్షులు గౌరిశెట్టి రాజమౌళి గారు పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్య బాబు గాంధీజీ సూత్రాలను పాటించాలన్నారు. తదుపరి విష్ణు అనాధాశ్రమాలయంలో అనాధ బాలురలకు బేడీషీట్స్, స్వీట్స్, ఫ్రూట్స్ పంపిణి చేసారు. కార్యదర్శి ఐత లక్ష్మీనారాయణ మరియు కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
అవోపా హుజురాబాద్ గాంధీ జయంతి ఉత్సవాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి